బేరియాట్రిక్

అధికబరువు వల్ల అన్నీ సమస్యలే...ప్రతిచోటా అసౌకర్యం...అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళి సమస్య...పదిమంది మధ్యకు రాలేని ఆత్మన్యూనతా భావం...లైఫ్ క్వాలిటీని, జీవన కాలాన్ని తగ్గించే డయాబెటీస్, బిపి, గురక, కీళ్ళు, ఎముకలు, మోకాళ్ళ బాధలు, మూత్రాన్ని ఆపుకోలేని వత్తిడి మొదలైన 20 వరకూ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు... ఎక్సర్ సైజులు, బేలెన్స్డ్ డైట్, లైఫ్ స్టయిల్ లో మార్పులు బరువును తగ్గిస్తాయి... అపరిమితమైన బరువు తగ్గించుకోడానికి బేరియాట్రిక్ సర్జరీ అవసరం కావచ్చు ఎవరెవరికి ఏఏ పద్ధతులు అవసరమౌతాయి? వాటిలో సమస్యలు సానుకూలతలు ఏమిటి?

బేరియాట్రిక్ సర్జరీ ఎందుకు? ఏమిటి? ఎలా?

బేరియాట్రిక్ సర్జరీ అంటే జీవన విధానంలో పెద్దమార్పు తెచ్చుకోవడమని గుర్తించాలి. లైఫ్ క్వాలిటీని ఇది ఎలా పెంచుతుందో అవగాహన చేసుకోవాలి.

ఏ సర్జరీ కావాలో ఎలా తెలుసుకోవాలి?

1.భద్రత, 2.ఎంత మంచిఫలితం వస్తుంది, 3.హాస్పిటల్, డాక్టర్ల నుంచి ఎంత సపోర్టు వుంటుంది?
- ఈ అంశాలు చెక్ చేసుకున్నాకే సర్జరీకి వెళ్ళాలి


 • కాంప్లికేషన్లు/ప్రాణాపాయ పరిస్ధితుల అంకెల వివరాలు, సమస్యలు ఏర్పడితే చక్కదిద్దే సెకెండరీ / ఆల్టర్ నేటివ్ పద్దతులను తెలుసుకోవడం ద్వారా భద్రత ను గుర్తించవచ్చు
 • సర్జరీ తరువాత ప్రతీ నెలా బరువులో తగ్గుదలలు సర్జరీ ఫలితాలను చెబుతాయి...డయాబెటీస్ (టైప్2), హెచ్చు కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రజర్, ఊపిరందక నోటిద్వారా గాలిపీల్చడం/గురక సమస్యలు తొలగిపోవడం/తగ్గిపోవడం/అదుపులో వుండటం ద్వారా సర్జరీ ఎఫెక్టివ్ నెస్ తెలుస్తుంది.
 • సర్జరీకి ముందు, తరువాత సర్జన్లు, వారి సహాయకులు, కౌన్సిలింగ్ నిపుణులు, డైటీషియన్ల నుంచి పేషెంటుకి ఎలాంచి సేవలు, సూచనలు, సలహాలు ఎంతకాలం ఎలా అందుతాయి అనేవివరాలు తెలుసుకోవడం ద్వారా ఏ విధమైన సపోర్టు దొరుకుతుందో తెలుసుకోవచ్చు.
 • గాస్ట్రిక్ బాండింగ్!

  ఇది తినే ఆహారాన్ని పరిమితం చేసే విధానం. ఇందులో కడుపుని రెండుభాగాలుగా విభజిస్తూ బాండ్ వేస్తారు. అరకప్పు ఆహారం మాత్రమే పట్టే విధంగా పైభాగం చిన్నసంచి మాదిరిగా వుంటుంది. కొంచెం తినగానే కడుపు నిండుతుంది. ఆ సంకేతం మెదడుకి అందదడం వల్ల ఆకలి అనిపించదు.

  గాస్ట్రిక్ బైపాస్!

  ఇది రెండు ప్రొసీజర్ల కాంబినేషన్. బాండింగ్ తోపాటు సర్జరీ ద్వారా కడుపులో పైభాగంలో ఏర్పడిన సంచి నుంచి చిన్న పేగుని బైపాస్ చేసి చివరి భాగానికి కలుపుతారు. ఇందువల్ల చాలా తక్కువపొడవు చిన్నపేగులో మాత్రమే ఆహారం వుండి ఫుల్ అయిన సిగ్నల్ మెదడుకి అందుతుంది. .

  స్లీవ్ గాస్ట్రెక్టమీ!

  ఇది మొత్తం సైజుని తగ్గించే పద్ధతి. ఇందులో కడుపుని నిలువుగా లోనికి మడతవేసి స్లీవ్ తొడిగి స్టాప్లింగ్ చేస్తారు. స్లీవ్ వల్ల కడుపు సైజు సుమారు ఐదవవంతుకి తగ్గిపోతుంది. 50 నుంచి 150 మిల్లీలీటర్ల ద్రవపదార్ధం మాత్రమే పట్టేటంత సైజు తగ్గిపోతుంది.

  ఈ మూడు రకాల సర్జరీల వల్లకూడా కొద్దిపాటి ఆహారమే తీసుకోవడంతో అదనపు కేలరీలు మిగలవు..శరీరానికి ఎనర్జీ ఇవ్వడానికి అప్పటికే లోపల ఫాట్ కరగడం మొదలౌతుంది. ఆవిధంగాబరువు తగ్గుతారు

  సర్జరీ తరువాత లైఫ్

  ఆహార నియమాలు:

  సర్జరీతరువాత చిన్నపేగు పని తీరు శాశ్వతంగా మారుతుంది. డాక్టర్ సలహ ప్రకారం ఆమార్పుకి అనుగుణమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

  బర్త్ కంట్రోల్, గర్భధారణ :

  బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న స్త్రీలు 16-24 నెలలు గర్భవతులు కాకూడదు. ఆకాలంలో సంతాన నియంత్రణ పద్ధతులు పాటించాలి.

  హెచ్చుకాలం ఫాలోఅప్ :

  సర్జరీ తరువాత బ్లడ్ సెల్ కౌంటు, విటమిన్ B 12, ఫోలేట్, ఐరన్ లెవెల్స్ పై 3 నుంచి 6 నెలలకు పరీక్షలు చేయించుకోవాలి. తరువాత ఏడాది లేదా రెండేళ్ళకోసారి పరీక్షలు చేయించుకోవాలి.

  How to Find Us

  • సర్జరీ డిపార్ట్ మెంట్
   GSL మెడికల్ కాలేజి హాస్పిటల్
   NH 5,     లక్ష్మీపురం
   రాజానగరం వద్ద


   స్వతంత్ర హాస్పిటల్స్
   కంబాలపార్క్ సెంటర్
   రాజమండ్రి
  • ఫోన్స్ : సతీష్ 84999 19888
                 డాక్టర్ సమీర్ రంజన్ నాయక్ 95505 21218
                 డాక్టర్ రవితేజ 94944 21828
  • mail@gslhs.in